నో బడ్జెట్‌తో తీసిన ప్రయోగాత్మక మూవీ ‘1134’.. జనవరి 05న రిలీజ్

1134 Movie

1134 movie

కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రాలకు ఆడియన్స్‌ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌లను తెరపై చక్కగా ఆవిష్కరిస్తే.. కచ్చితంగా సూపర్ హిట్ చేస్తున్నారు. అలాంటి ఓ డిఫరెంట్ ప్రయోగమే ‘1134’ మూవీ. వైవిధ్యమైన టైటిల్‌తో.. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌ బ్యాక్‌డ్రాప్‌ తెరకెక్కిన ఈ సినిమాకు శరత్ చంద్ర తడిమేటి దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడిగా తన తొలి సినిమాతో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. 

 

 

శాన్వీ మీడియా బ్యానర్‌పై రూపొందించిన ఈ మూవీకి భరత్ కుమార్ పాలకుర్తి సహ నిర్మాతగా వ్యవహరించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీని జనవరి 05 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో బలమైన కథా, కథనంతో సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 2 నిమిషాల 28 సెకనుల నిడివితో వచ్చిన ట్రైలర్ మెప్పించింది. తానే సొంతంగా స్టోరీ రాసుకున్న దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి.. హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించేలా రూపొందించేలా డిజైన్ చేసినట్లు తెలుస్ఓతంది. జనవరి 05 న థియేటర్లలో తమ సినిమాను చూసి ప్రేక్షకులు ఆదరించాలని మూవీ మేకర్స్ కోరారు.

ఈ సినిమాలో కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్, నర్సింగ్ వాడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ మురళీ కార్తికేయ మ్యూజిక్ అందించగా.. నజీబ్ షేక్, జితేందర్ తలకంటి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

==> నటీనటులు: కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్

==> డైరెక్టర్: శరత్ చంద్ర తడిమేటి

==> బ్యానర్: రాంధుని క్రియేషన్స్, శాన్వీ మీడియా

==> సహ నిర్మాత : భరత్ కుమార్ పాలకుర్తి

==> మ్యూజిక్: శ్రీ మురళీ కార్తికేయ

==> DOP: నజీబ్ షేక్, జితేందర్ తలకంటి

==> DI: గజ్జల రక్షిత్ కుమార్

==> PRO: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *