Nuvvu Naaku Nachav@22Years

By HARSHAD MEDIA | HYDERABAD | 6th SEPTEMBER 2023

Venkatesh – Nuvvu Naaku Nachav@22Years : వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్, సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, మాటలు హైలెట్‌గా నిలిచాయి. తెలుగులో కల్డ్ కామెడీగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం విడుదలై 20 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలు.. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. అంతేకాదు 2001లో మూడో అతి పెద్ద గ్రాసర్‌గా నిలిచింది. 2001లో బాలకృష్ణ నరసింహానాయుడు, పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ తర్వాత మూడో అతిపెద్ద హిట్‌గా ప్రేక్షకులు ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిపించారు.

ఈ సినిమాతో ఆర్తి అగర్వాల్ కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయం అయింది. నువ్వే కావాలి’ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు విజయ భాస్కర్, రచయత త్రివిక్రమ్ పనితనం నచ్చి .. నిర్మాత స్రవంతి రవి కిషోర్ తన నెక్ట్స్ మూవీ కోసం ముందుగానే వీళ్లిద్దరికి అడ్వాన్స్ ఇచ్చారు. అలా వీళ్లిద్దరు కలిసి ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా కథను రెడీ చేసారు. ఈ స్టోరీ స్రవంతి రవి కిషోర్‌తో పాటు నిర్మాత సురేష్ బాబుకు నచ్చింది. ఈ సబ్జెక్ట్‌తో వెంకటేష్ హీరోగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమా స్టోరీని త్రివిక్రమ్ వెళ్లి వెంకటేష్‌కు నేరేట్ చేసారు. మాటల మాంత్రికుని నేరేషన్‌కు వెంకటేష్ ఫిదా అయిపోయాడట. వెంటనే ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేసారు వెంకటేష్. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా మొత్తం ఓ ఇంట్లోనే జరుగుతోంది. ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారనే ఉద్దేశ్యంతో సెకండాఫ్‌లో బ్రహ్మానందం క్యారెక్టర్‌ను చేసారు. ఈ పాత్ర ‘నువ్వు నాకు నచ్చావ్’ సక్సెస్‌లో కీ రోల్ పోషించిందనడంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలో ముందుగా త్రిషను అనుకున్నారట. కానీ ఫైనల్‌గా ఆర్తి అగర్వాల్‌ను సెట్ చేసారు. హీరోయిన్ తండ్రి పాత్ర కోసం నాజర్, రఘువరణ్‌లను అనుకున్నారు. ఫైనల్‌గా ప్రకాష్ రాజ్‌కు ఆ పాత్ర వరించింది. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా కోసం నానక్‌రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోలో ఇంటి సెట్‌ను రూపొందించారు. దీని కోసం అప్పట్లో రూ. 60 లక్షల వరకు ఖర్చు అయింది. ‘నువ్వు నాకు నచ్చావ్’లోని రెండు పాటలను న్యూజిలాండ్‌లో పిక్చరైజ్ చేసారు. అపుడు వెంకటేష్ జ్వరంతో బాధపడుతున్నారు. షెడ్యూల్ పాడైపోకూడనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను పూర్తి చేసారు.

‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాను రూ. 3 కోట్ల బడ్జెట్‌తో 64 రోజుల పని దినాల్లో పూర్తి చేసారు. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాకు సంగీత దర్శకుడు కోటి అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్‌గా నిలిచాయి. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలోని నటనకు గాను హీరోయిన్‌ ఆర్తి అగర్వాల్‌కు రూ. 10 లక్షల పారితోషకం ఇచ్చారు. ఈ సినిమాను తమిళంలో విజయ్ హీరోగా ‘వసీఘర’గా రీమేక్ అయింది. కన్నడలో ఉపేంద్ర హీరోగా ‘గౌరమ్మ’గా రీమేక్ అయింది. అటు బెంగాలీలో ఈ సినిమా ‘మజ్ను’గా రీమేక్ అయింది. అప్పటి ఉమ్మడి ఏపీ నుంచి 5 నంది అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ కుటంబ కథా చిత్రం,బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్, బెస్ట్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్, బెస్ట్ కోరియోగ్రాఫర్, బెస్ట్ డైలాగ్ రైటర్ విభాగంలో అవార్డులు గెలుచుకుంది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 8 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలిపి రూ. 4 కోట్లు కొల్లగొట్టింది. మొత్తంగా రూ. 12 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

© Copyright Harshad Media Network Pvt Ltd 2023. All rights reserved.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *